7/02/2012

Sikha Bandhana Vidhi and Sikha Bandhana Mantram

స్నానే  దానే  జపే హొమే సంధ్యాయామ్ దేవతార్చనే !
శిఖా  గ్రంధిం  వినా  కర్మ న  కుర్యాద్  వై  కదాచన !!
శిఖను అనగా జుట్టుముడి వేయకుండా స్నానము , దానము జపము , హొమం , సంధ్యోపాసన , దేవతార్చన , ఇత్యాది కర్మలను ఎప్పుడు కూడా చేయకూడదు .
శిఖను లేదా జుట్టును ముడి వేయుటకు దిగువ పేర్కొనబడిన మంత్రమును గాని లేదా గాయత్రీ మంత్రమును గాని పఠింప వలయును . ఒక వేళ శిఖ లేని యడల దానిచోట ఒక దర్భ కఱ్ఱను దరించవచ్చు ననేడి  విశేష విధానము కూడా చెప్పబడినది .
శిఖ ముడివేయు మంత్రం :-
చిద్రూ పిణి ! మహా మాయే ! దివ్య తేజస్సమన్వితే !
తిష్ఠ  దేవి !  శిఖా మధ్యే  తేజో వృధిమ్  కురుష్వ మే !!

No comments:

Post a Comment