6/26/2012

How only india is unique puja place for this world {భారత దేశము ప్రపంచానికి పూజా మందిరం}

భారత దేశము ప్రపంచానికి  పూజా మందిరం ,నేను యదార్ధం చెబుతున్నాను , శంకరా చార్యుల  వారి దృష్టిలో ఈ భారత దేశము పంచాయితన  పూజా మందిరము ,అందుకనే మిగిలిన దేశాలన్నీ సౌఖ్యంగా  వుంటాయి , ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థితి వలనే. ఇది పూజామందిరం , కాబట్టి ఇక్కడ మడి కట్టుకొని ఉండాలి ,ఇది పూజా మందిరం కాబట్టి ఇక్కడ సత్వ గుణంతో ఉండాలి , పూజా మందిరంలో పూజ చేయాలి కానీ ఇల్లు నీది ఆయనంత మాత్రం ఎక్కడ బడితే అక్కడ పూజ చేయవుగా , అందుకే పూజ చేయటానికి గాయత్రీ చేయటానికి యజ్ఞము చేయటానికి యాగము చేయటానికి ఒక్క భారత దేశము ఒక్కటే యోగ్యం ,మిగిలినవి ఆ యోగ్యతను పొందినవి కావు ,ఇల్లంతా నాది అయినంత మాత్రమున పడక గదిలో పూజ చేయనుగా ,అది యెంత చిన్నది అయిన సరే ,సరిపోక పోయిన సరే ఇంటిలో ఈశాన్యము లోనే పూజ చేస్తాము,ఈశాన్యం అందుకు తగిన చోటు , ప్రపంచానికి అంతటికి  పూజా మందిరం భారత దేశమే , మీరు పూజా మందిరములోకి వెళ్లి చేసినటువంటి నమస్కారము చేత కలిగి నటువంటి భగవంతుని కారుణ్యము మీ ఇంటి నంతటిని రక్షించి నట్లే , భారత దేశములో జరుగుతున్న యజ్ఞ యాగాదుల వలననే ప్రపంచం నిలబడింది తప్ప ఎక్కడో ఎవడో ఎక్కడో చేస్తే నిలబడింది కాదు , మన వలన నిలబడింది ఈ ప్రపంచం , అది ఈ దేశం యొక్క గొప్పతనం , అది ఈదేశం  యొక్క ధర్మం యొక్క గొప్పతనం ,అటువంటి దేశం అసలు పంచాయితన పూజా పళ్ళం ఎలానో తెలుసా ,భారత దేశము మద్యలో నర్మదా నది  ఉంటుంది , ఆ నర్మదా నది లోనే శివలింగాలకు సంభందించిన సాలగ్రామం దొరుకుతుంది ఇప్పటికి , అదే నర్మదా బాణం అనికూడా అంటారు ,అలాగే మనకు గూడూరు దెగ్గర ఉన్నటువంటి సువర్ణ ముఖి నదిలో దొరికే  బంగారు తీగ మద్యలో ఉన్నదా అనిపించే సాలగ్రామం అమ్మవారికి సంభందించిన అంబికమ్  , అలాగే నేపాల్ లో గండకి నదిలో దొరుకు సాలగ్రామం విష్ణు సాలగ్రామం ,అలాగే తంజావూరు వద్ద ఉన్నటువంటి వల్లం అనేటువంటి ప్రదేశం లో తనంతట తాను తవ్వకుండా ఏర్పడిన చెరువు ,అందులో నీరు ఇంకదు ,ఆ చెరువులో ఎర్పడతాయ్ తెల్లటి సాలగ్రామాలు అవి సూర్య భగవాన్ కు సంభందించిన సాలగ్రామాలు, వాటిని ఆదిత్యం అని పిలుస్తారు ,ఆలాగే షోన  భద్రానది, అది 30 కిలోమీటర్ ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది అందులో గణపతికి   సంభందించిన సాలగ్రామాలు విరివిగా దొరుకుతాయ్ , ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అందులో స్నానం చేసి వస్తు బుట్టలు బుట్టలు గణపతి సాలగ్రామములు తీసారు , ఈ ఐదు సాలగ్రామాలు రాయి అని అనకూడదు,శివ లేక విష్ణు పంచాయతనం అని అనాలి , వాటిని తెచ్చుకొని మడి ఆచారం , నిత్య కర్మలు పాటించే వారు ఇంటిలో పూజిస్తే జన్మ ధన్యము  అవుతుంది , కుదరనివారు ఆయా నదులలో జీవితంలో ఒక్క సారి స్నానం ఆచరిస్తే చాలు , కావున ఈశ్వరుడే వాటిని మన దేశములలో శివ పంచాయతన దేశముగా సహజంగా పెట్టారు కాబట్టి ప్రపంచానికి అంతటికి  పూజా మందిరం భారత దేశమే అనటంలో ఎట్టి సందేహం లేదు .ధన్యవాదాలు .

No comments:

Post a Comment