Hindu Priest |
భస్మ త్రిపుండ్రై పూతాత్మా మృత్యుం జయతి మానవః !!
తాత్పర్యం : శ్రాద్దము , యజ్ఞము , జపము ,హొమము, వైశ్వదేవము,దేవతర్చానము,మొదలుగున్నవి చేయుటకు ముందు భస్మ త్రిపుండ్రము ను ధరించిన మానవుడు మృత్యున్జయుడే యగును !
అకృత్వా భస్మ తిలకం తస్య కర్మ నిరర్ధకం :- నుదురు పైన తిలకం , లేక భస్మము లేకుండా చేసే కర్మలన్నీ నిరర్ధకములు అయపోవును. కావున తమ తమ సంప్రదాయములను అనుసరించి నుదురు పై తిలకమును గాని భస్మమును గాని ధరించి సంధ్యాది నిత్య కర్మలను ఆచరింపవలెను . అత్యవసర పరిస్థితిలో కనీసం భస్మము లేక తిలకము లభించని యెడల జలమును భస్మము వలె మంత్రించి ధరించి నిత్య కర్మలను ఆచరించవచ్చు అని ఋషి మతము .
ఊర్ధ్వ పుండ్రం మృదా కుర్యాద్ భస్మనా తు త్రిపుండ్రకమ్ !
ఉభయం చందనే నైవ అభ్యంగోత్సవ రాత్రిషు !!
మృత్తిక లేక గోపి చందనంతో ఊర్ధ్వ పుండ్రం ను ,భస్మముతో త్రిపుండ్రం ను , శ్రీ చందనం తో రెండు రకములుగా తిలకమును దరించ వచ్చును .ఉత్సవాదులయందు రాత్రి వేళలలో శ్రీ చందనం ను సర్వాంగములయందు ధరింపవలెను .
What is the Bhasma Dharana Mantram and The Tripundra Dharana Mantram ?
ఆగ్నేయం భస్మ సద్యోజాత మితి పంచ బ్రహ్మ మంత్ర్: ప్రతి గృహ్య !!
అనగా సద్యో జాతాది మంత్రములను పఠిoచుచు భస్మమును చేతిలోనికి తీసుకోన వలెను .
తదుపరి అగ్నిరితి భస్మం అను మంతమును పఠిoచుచు చేతి లోని భస్మమును అభిమంత్రించవలెను .
మనస్తోక ఇతి సముత్ ధృత్య జలేన సంసృజ్య !!
మనస్తోకే అను మంత్రముతో భస్మమును జలముతో తడుపవలెను .
త్ర్యాయుషం , త్రయమ్బకై: తిర్యక్ తిస్రో రేఖాః ప్రకుర్వీత !!
త్ర్యాయుషం , త్రయమ్బకం మంత్ర ములను పఠిoచుచు భస్మమును మూడేసి రేఖల చొప్పున లలాటము , కంఠము, భుజము ,కరము హృదయము ,ఉదరములయందు ధరింపవలెను.
How to ware the Bhasma are The Tripundra ?
శ్లో : ప్రాతః ససలిలం భస్మ మద్యహ్నే గంధ మిశ్రితమ్ !
సాయాహ్నే నిర్జలం భస్మ ఏవం భస్మ విలేపయేత్ !!
శ్లో : మధ్యమానామి కాంగుఅన్గుహ్హ్ట్ : అనులోమ విలోమతః !
అతి స్వల్ప మనా యుష్యమ్ అతి దీర్ఘం తతఃక్షయం !!
నేత్ర యుగ్మ ప్రమాణేన భాలే దీప్తం త్రిపుండ్రకమ్ !!
తాత్పర్యం : ప్రాతః కాలమునందు నీటితో తడిపిన భస్మమును , మద్యాహ్నము నందు గంధముతో కలిపిన భస్మమును సాయంత్రము తడిలేని భస్మమును ధరింపవలెను . భస్మమును ధరించునపుడు ముందుగా బొటనవ్రేలి తో ఊర్ధ్వ పుండ్రం ను అనగా నామము ను నిలువుగా ధరించిన పిమ్మట మధ్యమ , అనామికల అనగా నడిమి ,ఉంగరము వేళ్ళతో ఎడమ నుండి కుడి వైపుకు రెండు రేఖలను ధరించి , బొటనవ్రేలి తో కుడి నుండి ఎడమ వైపునకు ఒక రేఖను ధరింపవలెను.ఈ విధముగా మూడు భస్మ రేఖలను ధరింపవలెను.మూడు రేఖల మద్య స్థానము ఖాళీగా ఉండవలెను . ఈ భస్మ రేఖలు అతి చిన్నవిగా కానీ అతి పెద్దవిగా కానీ ఉండకూడదు . నేత్ర యుగ్మ ప్రమాణముగా అనగా రెండు కనుల చివరి భాగమును దాటి పోకుండా నుదురు భాగ మందు భస్మమును మూడు రేఖలుగా ధరించవలెను .
ఫై వ్యాసం ఫై మీ అమూల్య మైన సూచనలు సలహాలు క్రింద పోస్ట్ చేయగలరు . మీ సూచనలు మాకు ఆమూల్యము .
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి
sarmaaji@gmail.com .
:మంగళం మహాత్:
No comments:
Post a Comment