10/21/2011

Sahasra Lingarchana Vidhanam Ekadasha Rudrabhisheka vidhi

 Sahasra Lingarchana vidhanam Ekadasha-Rudrabhisheka:- 

సహస్రలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము :-
కలియుగమున ప్రతి ఒక్కరు ప్రతి దినము పరమేశ్వరుని ఆరాధన మరియు అభిషేకం చేయుట నిత్య కర్మలలో భాగము.కానీ కలిప్రభావము వలన ఐహిక విషయాలలో మునిగి ఈశ్వర  ఆరాధన మరుస్తున్న రోజులివి . ఇలాంటి కాలములో ఈశ్వర కృపచే ధర్మార్ధ ,కామ్య,మోక్షములు పొందవలెను అనిన, యావత్ సంవత్సరము ఈశ్వర ఆరాధన చేసిన ఫలమును ఇచ్చు మాసము కార్తీకము.అట్టి ఈ కార్తీకమాసమున ఏకాదశ రుద్రాభిషేకము లేక పుట్ట మన్నుతో మహాలింగార్చన{mahalingarchana 365లింగములు} లేక సహస్రలింగార్చన {sahasralingarchana 1116లింగములు} చేయుట ఎంతో విశేషము. ఇందు  సహస్రలింగార్చన షోడస ఆవరణములతో అనగా 16 ఆవరణములతో కూడినదై, కైలాస మహా యంత్ర ప్రస్థాన స్థిత ఉమా మహేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైనది.ఈ సహస్రలింగార్చన క్రతువులో ముందుగ "ఆది పూజ్యో వినాయకః " అన్నట్లుగా గణపతి పూజ చేయ వలను .తదుపరి పుణ్యాః వాచనం జరిపి అట్టి ఉదాకముతో పుట్ట మన్ను ఉన్న స్థలమును ప్రోక్షణ చేసి భూమిని ప్రార్ధించి,పూజించి,పుట్టమన్ను గ్రహించవలెను.శుభ్ర పరిచిన పుట్ట మన్నును విభూతి,పసుపు,కుంకుమ,సుగంధ ద్రవ్యములు,పంచామృతం,పాదరసములతో ,కొద్దిగా కలిపి, రొట్టె పిండి వలె తడప వలెను.తదుపరి వేళ్ళకు నెయ్యి రాచుకొని కొద్ది కొద్దిగా మన్ను తీసుకోని 1116లింగములు పంచాక్షరి మంత్రము స్మరిస్తూ చేయవలెను.అలా చేసిన లింగములను పై చిత్రపటము సహాయముతో వరుసగా వంకర లేకుండా తడిపి పిండిన తెల్లని వస్త్రము పై పేర్చవలెను.తదుపరి కాచి చల్లార్చిన ఆవు నేతిని పేర్చిన లింగములపై చల్ల వలెను.
 1116లింగముల విశ్లేషణ ఆవరణ విధానముగా :-
 details of sahasralingarchana :-
  1. అష్టదిక్పాలకులు : 8 x 1 = 8 
  2. ద్వాదశాదిత్యులు :4  x 2 = + 4 = 12 
  3. త్రిశులేశ్వారులు : 8  x  3  = 24 
  4. తాన్డవేశ్వరులు :  50 x 8  = 400 
  5. అస్తభేతాలేశ్వరులు:4 x 2 = 8 
  6. చతుర్వేదములు :4  x  1  = 4  
  7. షోడద్వారపాలకులు: 8 x 2 = 16 
  8. పత్నీ సమేత అష్టమూర్తులు :8 x 2 = 16  
  9. పంచ బ్రహ్మలు : 5  x  5  = 25 
  10.  సప్తక్షు అష్ట అష్ట వసువులు: 7  x  8  =56 
  11.  నవగ్రహములు = 9 
  12.  పర్వత,నది,ఋషి,సాగరాలు = 4  x 7  = 28 
  13.  షట్ తారకలు : 6 
  14. గంగా,పార్వతీ:1 +1 =2
  15. ఏకాదశ రుద్రులు = 11
  16. మహాలింగము = 484 .
దక్షిణామూర్తి ,చండీశ్వరుడు,చంద్రకళ,చిత్రుడు,చిత్రగుప్తుడు,యముడు,గణపతి, = 7
ఈ విధముగా సమకూర్చుకొని పాంచభౌతిక శరీర శుద్ధి అర్ధం మహన్యాస పారాయణం గావించి ఏకాదశ రుద్రాభిషేకము చేయ వలెను .సర్వేజన సుకినోభవంతు.