11/08/2020

జాతకంలో యోగాలు

విపరీత - రాజయోగాలు

గ్రహ ల ప్రకారం 6-8-12 అధిపతులు నైసర్గికత్వంతో సంబంధం లేకుండానే అంటే శుభులైన, పాపులైన 6-8-12 భావాలలో ఉంటే రాజయోగాన్నిస్తారు. 6-8-12 భావాధిపతులు అందరు కలసి గాని, విడివిడిగాగాను 6-8-12 రాశులలో ఎక్కడ ఉన్న విపరీత రాజయోగం పడుతుంది. వీరి కలయిక కూడా శుభమే. ఆదిపత్య విషయంలోనూ, శత్రు, మిత్ర రాశులలో ఉన్నారా అనేది చూడనక్కరలేదు. జాతకచక్రంలో విపరీత రాజయోగాన్ని పొందిన జాతకుడు 6-8-12 భావాధిపతుల దశ, అంతర్ధశలలో ఉద్యోగంలో ఉన్నతి, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ప్రభుత్వంలో మంచి పలుకుబడి, సౌఖ్యాలు పొందుతాడు.

మంత్రేశ్వరుని ఫలదీపికలోని గ్రంధం ప్రకారం 6-8-12 భావాల విషయంలో భావఫలితాలు ఈ క్రింది విధంగా విశేష యోగాలు ఉంటాయని తెలియజేశారు.

హర్షయోగం
6 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 6 వ భావాన్ని చూసిన లేక 6 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి హర్షయోగం సిద్ధిస్తుంది. హర్షయోగ జాతకుడు సుఖం, సంతోషాలు కలిగి  అదృష్టవంతుడవుతాడు. శత్రువులపైన విజయాలు kపొందువాడుగాను, చెడు వ్యసనాలు, చెడు కార్యాలపైనా ఆసక్తి లేనివాడుగాను, సంఘంలో గొప్పవారుగాను, విశేష కీర్తిని ఆర్జించు వారుగాను, కీర్తివంతులకు స్నేహితులుగాను, మంచి స్నేహితులు కలిగి ఉంటారు. సత్ సంతానాన్ని పొందుతారు. ధనార్జన కలవాడుగాను ఉంటారు.

సరళయోగం
8 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 8వ భావాన్ని చూసిన లేక 8 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి సరళయోగం సిద్ధిస్తుంది. సరళయోగ జాతకుడు దీర్ఘాయువు కలవాడు. నిలకడైన మనస్సు కలవాడు. బుద్ధిమంతుడు, విధ్యావంతుడు, పుత్ర సంతానం కలవాడు, శత్రువులపైన విజయం పొందువాడు. మిక్కిలి ధనవంతుడు. ఏ పని చేపట్టినా విజయం సాదించుటలో పట్టుదల కలవాడు, మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్ఠలు కలవాడు అవుతాడు.

విమలయోగం
12 భావంలో 6-8-12 భావాధిపతులు ఎవరైనా ఉన్న లేక వారిలో ఎవరైనా 12 వ భావాన్ని చూసిన లేక 12 వ భావాధిపతి 6-8-12 స్ధానాలలో ఎక్కడైనా ఉన్న ఆ జాతకునికి విమలయోగం సిద్ధిస్తుంది. విమలయోగ జాతకుడు ధనార్జన కలవాడగును. ధనం వృధాగా ఖర్చు చేయనివాడగును. తనని నమ్ముకున్నవారిని ఆదరించేవాడగును. సుఖవంతుడగును. స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనువాడగును, గౌరవమైన వృత్తికలవాడగును. సంఘంలో గొప్పవాడగును.

మతాంతరంలో సత్యాచార్యుని ప్రకారం 6-8-12 భావాల విషయంలో భావఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటాయని తెలియజేశారు.

6 భావం శతృభావం కాబట్టి ఆ భావంలో శుభగ్రహాలు ఉంటే శత్రువులపైనా విజయం, పాపగ్రహాలు ఉంటే శత్రువృద్ధి అనగా విరోధులు ఎక్కువగా ఉంటారు.

8 భావం మృత్యుభావం కాబట్టి అందులో శుభగ్రహాలు ఉంటే ఆయువృద్ధి కలుగుతుంది. పాపగ్రహాలు ఉంటే మృత్యుహాని, తీవ్రరోగం, అపాయాలు కలుగుతాయి. ఆయుష్కారకుడైన శని అష్టమ భావంలో ఉంటే ఆయువును వృద్ధి చేస్తాడు. జాతకుడు దీర్ఘాయువు కలవాడవుతాడు. “కారకోభావనాశాయ” సూత్రం ఇక్కడ వర్తించదు.

12 భావం వ్యయభావం కాబట్టి అందు శుభగ్రహాలు ఉంటే వృధా ఖర్చులు తగ్గుట జరుగుతుంది. వ్యాపార విషయంలో నష్టాలు తగ్గుట జరుగుతుంది. పాప గ్రహాలు ఉంటే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండుట, వ్యాపార విషయంలో మిక్కిలి నష్టాలు కలుగుతాయి.

జాతకం లో పెళ్లి తొందరగా జరుగుతుందా లేదా ఆలస్యంగా జరుగుతుందా ? తెలుసుకోవటం ఎలా?


జాతక చక్రం పరిశీలించినపుడు జాతకం లో పెళ్లి తొందరగా జరుగుతుందా లేదా ఆలస్యంగా జరుగుతుందా అనే విషయం గమనించాలి. ప్రస్తుతం 22 సంవత్సరాలలోపు జరిగే వివాహాలను శ్రీఘ్ర వివాహంగా అనుకోవచ్చు.
1. లగ్నం, సప్తమభావమందు శుభగ్రహాలు ఉండి సప్తమాదిపతి పాపగ్రహములతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందిననూ...
2. ద్వితీయ అష్టమ స్థానమలలో శుభగ్రహాలు ఉన్నప్పుడు...
3. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథునరాశిలో గాని, తుల, వృషభరాశులలో గాని, రవికి 150 లకు పైగా దూరంగా ఉన్నప్పుడు...
4. శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు...
5. శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు...
6. జలతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.
ఆలస్య వివాహం అనగా 28 సంవత్సరాలు, ఆపైన జరుగునవి. వివాహం ఆలస్యం అవడానికి గల కారణాలు...
1. లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా... శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు...
2. సప్తమ స్థానమందు రెండుగాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు...
3. ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు...
4. శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు...
5. శుక్రుడు రవి గ్రహానికి 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు...
6. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు...
7. సప్తమ భావముపై, సప్తమాధిపై పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.

ఈ విధంగా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తరు వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించాలి.
వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంలు దాటిన తరువాత వచ్చు దశ అం తర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావమును చూస్తున్న లేదా సప్త మాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాదిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాం శమందు న్న రాశి నాదుని యొకక దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా వివా హం జరుగు కాలం నిర్ణయించిన తరువాత గురు గ్రహం గోచార గమనమును బట్టి వివా హం జరుగు సంవత్సరం నిర్ణయించాలి. అబ్బాయిల జాతకంలో శుక్రుడు, అమ్మాయిల జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివా హం జరుగుతుంది.