9/08/2011

kuja dosham and remedies

                   కుజ దోషము -ఇతర విషయములు
1 .జాతక పారిజాతం లో 2,4,7,8 స్థానములలో కుజుడు ఉన్నచో పురుషునికి భార్య వియోగము స్త్రే కి భర్త వియోగం ఉన్నది.
2 .బృహత్ హోరా శాస్త్రం లో కుజ దోషాన్ని లగ్నం నుండి కాకుండా శుక్ర ,చంద్ర  లగ్నాల నుండి కూడా పరిశీలించాలి.
3 .స్త్రీ జాతకం లో గురు బలం వల్ల పురుష జాతకం లో శుక్ర బలం వల్ల కుజదోషం పూర్తిగా ఉండదు .
4. జమిత్రీచ యధా సౌరి లగ్నేవా హీబుకీధవ |
   నవమే ద్వాదశీ చైవ కుజదోషం న విద్యావే ||
   శని జన్మ లగ్నం లో గని 7,4,9,12 స్థానాలలో గాని ఉంటె కుజదోషం ఎక్కువగా ఉండదు.
5 .మేష,కర్కాటక, సింహ ,వృశ్చిక ,ధనుర్ ,మకర ,మీన లగ్నాలలో జన్మించిన వారికీ ఏ స్థానములో ఉన్న కుజదోషం ఉండదని కొందరు పెద్దలు కొన్ని గ్రంధాలలో పెర్కున్నారు .కానీ ఈ అభిప్రాయం తప్పు 12 లగ్నలలో 7 లగ్నాలు  వారి  కుజదోషం ఉండదు.
6.కుజదోషము నిర్ణయించునపుడు భావ చక్రము తప్పక పరిశీలించు కో  గలరు .
7 .కుజదోషము నకు శని,రవి,రాహు,కేతు,గ్రహ దృష్టి ,కలయిక,మంచివి కావు .ఇంకా దోష ప్రధమగును.
8.ముఖ్యముగా భుధుని  తో కలయిక మంచిది కాదు.
 9.ప్రవాళ గొధూమ మశూరికాశ్చ వృషారుణశ్చాపి గుడో సువర్ణం|
  అ రక్త వస్త్రం శరవీర పుష్పం తామ్రంహి భౌమాయ పదన్నిదానం||
   పగడము,గోధుమలు,చిరుశెనగలు,యెర్రనిఎద్దు,బెల్లం,బంగారము,యెర్రనివస్త్రం,యెర్రగన్నేరు,రాగిని కుజదోషము పరిహారము మంగళవారము దానము ఇవ్వవలేను .
 10 . కుదోశము నివారణకు వేదోక్తముగా కుజ వేద మంత్రమును 7.000 సార్లు జపము , 700 తర్పణము , 70 సంఖ్య హోమము ,కందులు దానము చేయవలెను .