2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు
పునర్వసు నక్షత్ర
4 వ పాదం లేదా పుష్యమీ
నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా
ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో
జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
శ్రీ ప్లవ నామ
సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం - 02, రాజ పూజ్యం - 06,
అవమానం - 06
పూర్వ పద్దతిలో
కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి
వారికి వ్రుత్తి వ్యాపారాలలో , కుటుంబ
వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు
గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత శార్వరి నామ సంవత్సరం
మాదిరిగానే గురు గ్రహం వలన ఇబ్బందులు కొనసాగును. ముఖ్యంగా గురువు 20-నవంబర్-2021 నుంచి తీవ్ర ఆర్ధిక సమస్యలు ఏర్పరచును. స్వార్జిత మరియు పిత్రార్జిత ధన
సంపదలు రెండూ వ్యయం అగును. వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్ర లేదా శత్రు
స్థానాలలో కలిగి ఉన్న కర్కాటక రాశి వారికి
శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా గురు గ్రహానికి తరచుగా అభిషేకాలు, శాంతి జపములు అవసరం.
కర్కాటక రాశి
వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి
లభించును. కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలు విజయం పొందును. జాతకంలో శని వలన
కళత్ర దోషం కలిగిన వారు ఈ సంవత్సరం కూడా వివాహ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొందురు.
కర్కాటక రాశి వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడు
సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో
కర్కాటక రాశి వారికి ఏలినాటి శని లేదు.
కర్కాటక రాశి
వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మంచి అనుకూల ఫలితాలు
ఏర్పరచును. కర్కాటక రాశి వారికి ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధనం ఉన్నదంటే అది
రాహు - కేతువుల వలననే ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి విజయం
ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. కర్కాటక
రాశి వారికి రాహు-కేతువుల వలన శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.
ఏప్రిల్ 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఉద్యోగ
జీవనంలో ఆశించిన గుర్తింపు లభించును. వ్యక్త్రిగత సమస్యల నుండి బయట పడతారు.
ఉద్యోగ వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో
లాభములు కలుగును. కుటుంబములో మీ మాట నెగ్గును. పుష్యమి నక్షత్ర జాతకులకు సంకల్ప సిద్ధి
ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలు ఏర్పడును, కుటుంబంతో సంతోష సమయం గడిపెదరు . 9వ తేదీ నుండి
ధనార్జన పరంగా నిలకడైన జీవనం ఆరంభం అగును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నాలు
ఫలిస్తాయి. కళత్ర జీవనంలో సౌఖ్యం లభించును. ఉన్నత వర్గం వారితో స్నేహం - తన్మూలక లాభం పొందేదురు. ఇతరులకు మీ మీద ఉన్న
విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు.
మే 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో
అన్నివిధాలా ఆదాయం బాగుండును. స్వశక్తితో అన్ని కార్యములు పూర్తి చేయగలుగుతారు.
విదేశీ సంబంధ ప్రయత్నములకు , వివాహ
ప్రయత్నములకు , సంతాన
ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం.
ఆర్ధిక రుణాల నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు చక్కటి ఉత్సాహం ఏర్పరచును. 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారముల వలన ఒక నష్టం ఎదుర్కోను సూచన.
జూన్ 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆరోగ్య
సమస్యలు కొద్దిపాటి చికాకులను ఏర్పరచును. సమస్యల పరిష్కారానికి చాకచక్యత అవసరం.
ధనాదాయం సామాన్యం. భాత్రువర్గం వారితో విరోధములు నష్టములు ఏర్పరచును. మానసిక
చాంచల్యత సంబంధ అనారోగ్యం వలన 18, 19 తేదీలలో ఇబ్బందులు ఎదుర్కొందురు. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో కొంత అనుకూలత మరియు జయం ఏర్పడును.
ఈ మాసంలో ధార్మిక కార్యక్రమాలకు ధనం అనుకోని విధంగా ఖర్చు పెట్టవలసి వచ్చును.
జూలై 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆలోచనలు
ఉద్రేకపూరితంగా ఉండును. ఎటువంటి కారణం లేకుండా కోపం, చిరాకు ఏర్పడుచుండును. ఆచార సంప్రదాయములను
విడిచి వ్యవహరించేదురు. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు కొనసాగును. కుటుంబ
పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. బంధు మిత్రుల ఆదరణ , చేయూత ఆశించిన విధంగా ఉండదు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన
మార్పులు ఏర్పడును. వినోద సంబంధ వ్యయం చేయుదురు. ఈ మాసంలో 3,8,11,13,17 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
ఆగస్టు 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో
ఆదాయములో పెరుగుదలకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరించును. మనసు ఉల్లాసంగా
ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి ఆశించిన రాబడి ప్రారంభమగును. కొన్ని వివాదాల
నుండి ఉహించని విధంగా బయట పడతారు.ఈ మాసంలో 14, 15, 16 మరియు 17 తేదీలలో కార్యానుకులత లభించును. ప్రభుత్వ
రంగంలోని వారికి అదనపు భాద్యతలు లభిస్తాయి , కార్య భారం పెరుగుతుంది. ఔషధ సంబంధ వ్యాపార
రంగం లోని వారికి చక్కటి అభివృద్ధి లభించును. యువకుల ఆలోచనలు సక్రమ మార్గంలో
ఉండును. చిన్న పిల్లల ఆరోగ్య విషయాలలో
జాగ్రత్త అవసరం. నూతన వస్తువులు ఈ మాసంలో కొనుగోలు చేయుట అంతగా కలసిరాదు.
సెప్టెంబర్ 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ప్రయత్న
ఆటంకములు ఎదురైనా అంతిమంగా విజయం లభించును. ధనాదాయం సామాన్యం గా ఉండును. సేవా
కార్యక్రమాల్లో పాల్గొంటారు.యుక్తితో సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ , తృతీయ వారములు
వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు
ప్రయత్నాలు అతి కష్టం మీద విజయం పొందును. ఇతరులు తమ మాట నిలబెట్టుకోరు. 23 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య కాలంలో కుటుంబ పెద్దలతో గొడవల వలన మానసిక అశాంతి
ఎదురగు సూచన ఉన్నది.
అక్టోబర్ 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వృత్తి ,
ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు
ఏర్పడవు. ఇతరుల సహకారము ఆశించిన విధంగా ఉండదు. ధనాదాయం తగ్గును. ప్రయాణాలు తీవ్ర
ప్రయాసలతో కూడి ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం
ఎదుర్కొందురు. మాసం మధ్యలో దైవదర్శన లేదా
పుణ్య క్షేత్ర సందర్శన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వేత్తల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది.
18 వ తేదీ తదుపరి సంతాన
ప్రయత్నాలకు అనుకూలమైనది. మాసాంతానికి ప్రశాంతత లభించును. ఈ మాసంలో 5,14,20,29 తేదీలు అంత అనుకూలమైనవి కాదు.
నవంబర్ 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఇష్టమైన
వ్యక్తులతో అదిక సమయం గడపగలుగుతారు. అయితే
ఆశించిన విధంగా ధనాదాయం ఉండదు. సంతానం వలన సౌఖ్యత అనుభవిస్తారు. నిర్ణయాలలో
జాప్యం వలన సమస్యలు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం
పొందుటకు సూచనలు ఉన్నవి. నూతన వ్యవహారాలు ముందుకు సాగవు. ద్వితియ వారంలో ఉద్యోగ
జీవనంలో ఆకస్మిక నష్టములు లేదా అధిక కార్య భారం ఎదుర్కొందురు. 16,17,18 తేదీలలో గౌరవ హాని సూచన. మాసాంతంలో ప్రయాణ
మూలక వ్యయం అధికమగుట మరియు ఆరోగ్య
భంగములకు కూడా సూచనలు ఉన్నవి.
డిసెంబర్ 2021
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆశించిన
రుణాలు పొందగలుగుతారు.శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ ప్రయత్నములు అతి కష్టం మీద
విజయవంతం అగును. 10 వ తేదీ తదుపరి
వ్యాపార విస్తరణ కు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ
కార్యములు విజయవంతం అగును. కోర్టు వ్యవహారములకు కూడా ఈ మాసం అనుకూలం . గృహ వాతావరణంలో
సంతోషములు మధ్యమ ఆనందములు ఇచ్చును. ఈ మాసంలో 18,24, 25, తేదీలు అనుకూలమైనవి కావు. 15,16 తేదీలు
వివాహ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును.
జనవరి 2022
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సామాన్య
ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో నూతన పనులు ఆరంభించకూడదు.భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ
చికాకులు ఎదుర్కొందురు. ద్వితియ వారంలో నూతన వస్త్ర లాభం పొందేదురు. ధనదాయంలో కూడా
కొంత పెరుగుదల లభించును. తృతీయ వారంలో కుటుంబంలో
చక్కటి వాతావరణం ఏర్పడును. చివరి వారం
ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఎదుర్కొందురు.
చికాకులు కలిగించే మరియు ప్రయోజనం లేని
ఫలించని ప్రయాణములు చేయవలసి వచ్చును.
ఫిబ్రవరి 2022
కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గృహంలో
విందు భోజనములు, అతిధులకు ఆతిధ్య
సంబంధ వ్యయం ఎదుర్కొందురు. గృహంలో వాస్తు మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూల కాలం.
సంతానం తో చికాకులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు బుధ గ్రహ బలం వలన తొలగును. తృతీయ
వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన ప్రమోషన్లు ఏర్పడును. అందరి మన్ననలను
పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు.
మార్చి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో
వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. పోటీ దారులు తొలగును.
ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన
మనస్తాపం అనుభవిస్తారు. మిత్రుల సహకారంతో కెరీర్ పరంగా వృద్ధి లభించును. ద్వితియ
వారంలో ఆకస్మిక ధన వ్యయములు , విదేశీ ఉద్యోగ
ప్రయత్నాలలో జాప్యం మరియు ప్రభుత్వ సంబంధ అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం
నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఏర్పడును.