2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు
మీ జన్మ నక్షత్రం
కృత్తిక 2,3,4 పాదములు లేదా
రోహిణి 1,2,3,4 పాదములు లేదా
మృగశిర 1,2 పాదములలో ఒకటి
ఐయిన మీది వృషభరాశి.
2021 - 2022 శ్రీ ప్లవ నామ
సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 07 అవమానం - 03.
పూర్వ పద్దతిలో
వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి
తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.
వృషభరాశి వారికి
శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు
గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును.
ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా బాధించును. జీవితంలో అనుభవిస్తున్న యోగం
చెడిపోవును. చేజేతులారా తప్పులు చేసి నష్టాలు ఏర్పరచు కొందురు. ఏ ప్రయత్నం కూడా
మానసికంగా సంతృప్తిని కలుగ చేయదు. నూతన భారీ పెట్టుబడులు 19-నవంబర్-2021 వరకు పెట్టకుండా ఉండటం మంచిది. 20-నవంబర్-2021 నుంచి వృషభ రాశి వారికి గురు గ్రహం యోగించును.
ముఖ్యంగా వ్రుత్తి విద్యా కోర్సులు చదివిన వారికి అతి చక్కటి ఉద్యోగ అవకాశములు,
స్వయం ఉపాధి చేయు వారికి
విశేష ధనార్జన ఏర్పరచును. విద్యార్థులకు విశేష లాభ పూరిత సమయం. ఎంతో కాలంగా ఎదురు
చూస్తున్న తీర్ధ యాత్రలు 20-నవంబర్-2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు. ఆచార వంతమైన
జీవితం ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విడిచి పెట్టాలని అనుకున్న
దురలవాట్లకు దూరం కాగలుగుతారు.
వృషభ రాశి వారికి
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం గడిచిన శార్వరి నామ సంవత్సరం వలెనే మంచి ఫలితాలను కలుగచేయును. నూతన వాహన కోరిక నెరవేరును.
వారసత్వ సంపద లభించును. పనిచేస్తున్న రంగములలో మిక్కిలి పేరు ప్రతిష్టలు పొందగలరు.
వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభించును. ఆర్ధిక లక్ష్యాలను
చేరుకొంటారు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రం లేదా ఉచ్చ స్థితి లేదా మూల త్రికోణము
లో ఉన్న వారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు. ఇటువంటి జాతకులు తమ వంశానికి
పేరు ప్రఖ్యాతలు వచ్చు సత్కార్యములు చేయుదురు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
వృషభ రాశి వారికి
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ల వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సమాజంలో
పేరు ప్రఖ్యాతలు ఏర్పరచును. కోరుకున్న విధంగా స్థాన చలనం ఏర్పరచును. పితృ
వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగును. అయితే శారీరక అనారోగ్యం, వైవాహిక జీవనంలో తీవ్ర గొడవలు, వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు
ఏర్పరచును.
ఏప్రిల్
2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ
ఫలితాలు. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం అని తెలుసుకుంటారు.సొంత మనుష్యులతో
విరోధములు చికాకులు ఏర్పరచును. సహాయం ఆశించి పొందక నిరాశ చెందుతారు. 17 వ తేదీ వరకు గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును.
వ్యవహార చిక్కులు లేదా ప్రయత్నాలలో
ఆటంకములతో విజయం పొందుతారు.. ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయవలసి వచ్చును. జూదం వలన
నష్టం. ఎదుర్కొందురు. 18 వ తేదీ తదుపరి
కొంత అనుకూలత లభించును. కుటుంబ సభ్యుల మధ్య బంధాలపై దృష్టి పెట్టవలెను. నూతన ఆదాయ
మార్గములు లభించును. మాసాంతంలో వాహన సౌఖ్యం అనుభవిస్తారు
మే 2021
వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కూడా
అంతగా అనుకూల ఫలితాలు ఉండవు. వాదనలకు ఈ మాసం అనుకూలమైనది కాదు. అయితే ధనాదాయం
సామాన్యం గా ఉండును. వ్రుత్తి జీవనంలో వేధింపులు కొనసాగుతాయి. వ్యవహార నష్టములు.
నూతన వ్యాపారములు ప్రారంభించుటకు , ఉద్యోగ జీవనంలో
మార్పులకు ఈ మాసం మంచిది కాదు. జీర్ణ వ్యవస్థకు
సంబంధించిన సమస్యలు ఎదరగుట వలన ధన వ్యయం ఎదుర్కొందురు. పితృ వర్గీయుల వలన
సహాయం పొందుతారు. ఈ మాసంలో 11,12,15 మరియు 16 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2021
వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆర్ధిక
సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. ఆదాయం ఆశించిన విధంగా లభిస్తుంది. రుణ ఒత్తిడులు
తగ్గుతాయి. నూతన పరిచయాలు జీవన ఉన్నతికి దారితీస్తాయి.లౌఖ్యంతో పనులు పూర్తి
చేయగలుగుతారు. శత్రుత్వములు తొలగును. మానసిక ప్రశాంతత, వృత్తిలో
ప్రోత్సాహకర వాతావరణం లభిస్తుంది. ద్వితియ వారం మరియు తృతీయ వారములలో ఆశించిన చక్కటి పురోగతి
లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు , సంతాన ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇచ్చును.
నాల్గవ వారం నుండి చేపట్టిన కార్యములందు స్తబ్ధత.తొలగి ప్రయత్న పూర్వక విజయాలు లభిస్తాయి. ఒక వేడుకకు సంబంధించిన సన్నాహాలు చేస్తారు
జూలై 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం
యోగదాయకంగా ఉండే కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు
లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారుతారు. మిత్రుల వలన లాభం పొందుతారు. నూతన
వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధమ
ద్వితియ వారాలలో కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సదావకాశం పొందుతారు. తల్లి గారి ఆరోగ్య
సమస్యల వలన మాత్రం ఆందోళన ఏర్పడుతుంది. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ రంగంలో వ్యాపార పెట్టుబడులు
చేయు వారు లాభం పొందుతారు. తృతీయ వారం నుండి ధనాదాయం పెరుగును. ఈ మాసంలో 15,
24, 30 మరియు 31 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
ఆగస్టు
2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో
తలపెట్టిన నూతన కార్యములు విజయం పొందును. వ్యక్త్రిగత జీవితానికి సబందించిన సముచిత
నిర్ణయాలు తీసుకో గలుగుతారు. సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఈ మాసం సంతాన ప్రయత్నములకు మంచి అనుకూలమైన కాలం.
ధనాదాయం బాగుండును. పొదుపు పధకాలలో పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం అనుకూలమైన కాలం.
ముఖ్యమైన పత్రాలకు సంబందించిన విషయాలలో జాగ్రత్త ఉండాలి. 19, 20 తేదీలలో వ్రుత్తి జీవనంలో ఉన్నతి లభించును.
చివరి వారంలో ఉద్యోగ ప్రయత్నములకు, ఉద్యోగ ఉన్నతి
కొరకు ప్రయత్నములు చేయుటకు అనుకూల కాలం.
ప్రశంసలు లభించును, ధనాదాయంలో
వృద్ది.
సెప్టెంబర్
2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వారసత్వ
సంబంధమైన లేదా కళత్ర మూలక ధన సంపదల వలన ఆర్ధిక సౌఖ్యం పొందుతారు. వ్యాపారములు
బాగా నడుస్తాయి. లాభములు ఆశించిన స్థాయిలో
ఉండును.వివాహ ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. సోదర వర్గీయులతో మాట తగాదాలు ఏర్పడు
అవకాశం ఉన్నది. మీ శ్రమ ఫలించి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.
ఆద్యాత్మిక భావాలూ పెంపొందుతాయి. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి సంబందించిన
అనారోగ్య సమస్యలు ఆందోళన ఏర్పడును. చివరి వారం గత కాలంలో నిలిపి వేసిన పనులు
తిరిగి ప్రారంభించుటకు అనుకూల కాలం.
అక్టోబర్
2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం భవిష్యత్
కు సంబందించిన ప్రణాళికలు రుపొందిన్చుకోనుటకు మంచి కాలం. వృత్తి వ్యాపార
ఉద్యోగాదులలో ఆశాజనకమైన కాలం పొందుతారు.పై అధికారుల సహకారంతో స్థాన చలన లేదా
ప్రమోషన్ సంబంధ విషయాల్లో విజయం పొందుతారు. విమర్శలకు ధీటుగా బదులిస్తారు. 13 వ తేదీ తదుపరి చేపట్టిన పనులు
అసంపూర్తిగా ముగించాల్సి వస్తుంది. మీ భాద్యతలు ఇతరులకు అప్పచెప్పడం వలన ఇబ్బందులు
ఎదురగును. ఆశించిన విధంగా విశ్రాంతి
లభించదు. వైవాహిక జీవన సుఖరాహిత్యత ఎదురగును. చివరి వారంలో ఒక ప్రమాదము నుండి త్రుటిలో తప్పించుకొనే సూచనలు
ఉన్నవి.
నవంబర్
2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం
కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు కూడా ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు.
ప్రతికూలతలు ఎదురగును. కుటుంబ వ్యయం అదుపు తప్పుతుంది. తలపెట్టిన పనులలో దైవ
ఆశీస్శులు అవసరం. అనుభవజ్ఞుల సలహాలు కోరుట మంచిది. ప్రభుత్వ సంబంధ పెద్దల వలన
సమస్యలు ఎదుర్కొందురు. వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు పొందుతారు. నూతన
ఆలోచనలు అంత త్వరగా కార్య రూపం దాల్చవు. అవకాశములు చేజారినా మంచిదే అనే భావన
పెమ్పొందిన్చుకోనుట అవసరం. సంతాన విద్యాభ్యాసం మాత్రం సంతృప్తిని కలుగ చేస్తుంది.
ఈ మాసంలో 5,9,10,26 తేదీలు
అనుకూలమైనవి కావు.
డిసెంబర్
2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం
కన్నా వ్యయం అధికంగా ఎదురగుటకు , గౌరవ హాని
సంఘటనలకు, ఆకస్మిక నష్టములు
పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. నూతన కార్యములు ప్రారంభించుట మంచిది కాదు.
ప్రధమ వారంలో రోహిణి నక్షత్ర జాతకులకు
కొద్దిపాటి ఆరోగ్య ఆపదలు ఏర్పడు అవకాశం ఉన్నది.
ఆరోగ్య విషయాల్లో మొండితనం మంచిది కాదు. ద్వితియ వారంలో ధనానికి ఇబ్బంది
లేకున్నా మానసిక సంతృప్తి ఉండదు. మిత్రులే శత్రువులగును. బందువుల మాటతీరు
పట్టించుకోనుట మంచిది కాదు. తృతీయ మరియు చివరి వారములు వివాహ ప్రయత్నములకు
అనుకూలం. గృహంలో మార్పులు చేపడతారు. మాసాంతంలో వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
జనవరి 2022
వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం మంచి
ఫలితాలను కలిగించును. తలపెట్టిన కార్యములందు జయం వరించును. తలచిన పనులు సకాలంలో
పూర్తి చేయగలరు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు
ఏర్పడుతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా కాలం
గడిపెదురు. అవకాశములు తక్షణం వినియోగించుకోనుట అవసరం. నిర్దిష్టమైన ఇష్ట
అయిష్టాలను ప్రదర్శించుట వలన మాట పడతారు. మాసాంతంలో ఉద్యోగులకు పై అధికారుల సహకారం వలన ఆశించిన వృద్ధి
లభించును.వ్యాపారములలో చక్కటి ధనప్రాప్తి లభించును. స్త్రీ సంతానం వలన సంతాన సౌఖ్యం పొందేదురు
ఫిబ్రవరి
2022 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో నూతన
బాధ్యతలు చేపడతారు. గౌరవ ప్రధమైన జీవనం అనుభవిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి.
ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. శరీర ఆరోగ్యం కూడా సహకరించును. ద్వితీయ వారం వరకూ
వృత్తి వ్యాపార విషయాల్లో మంచి లాభములు
లభిస్తాయి. తృతీయ వారం ప్రారంభం నుండి
పట్టుదలకు పోవడం వలన చక్కటి అవకాశములు కొల్పోవుదురు. ఉద్యోగ జీవనంలో
ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఎదురగును. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన
మానసిక ఆలోచనలు అధికం అగును.
మార్చి
2022 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో అంతగా
అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఉద్యోగ జీవన పరంగా ఆందోళన కలిగించు వాతావరణం ఏర్పడును.
ఆకస్మిక వివాదాలు భాదించును మరియు ధనాదాయం తగ్గును. బంధు వర్గం వలన వ్యక్తిగత జీవనంలో
ఒత్తిడులు ఎదురగును. ఆశించిన విధంగా సహకారం లభించదు. చివరి వారంలో చికాకులు అధికం
అగును. గృహ నిర్మాణ విషయాలలో వ్యయం అధికం అగును. ఈ మాసంలో 3,16,17,25 తేదీలు అనుకూలమైనవి కావు.
No comments:
Post a Comment