2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు
మృగశిర 3
, 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశికి చెందును.
2021- 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజ పూజ్యం - 03
అవమానం - 06
పూర్వ పద్దతిలో
మిధున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున రాశి
వారికి చేపట్టిన వ్రుత్తి సంబంధ కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.
మిధున రాశి
వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు
గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు అనేక ఆటంకాలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, సంతాన సంబంధ అనారోగ్యత , దాయాదుల వలన న్యాయస్థాన సమస్యలు , రక్త లేదా మెదడు నరాలకు సంబందించిన ఆరోగ్య
ప్రమాదాలు ఏర్పరచును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం మిధున రాశి వారికి పూర్తిగా
అనుకూలించును. వారసత్వ సంబంధ సమస్యలు తొలగి స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును.
మిధున రాశి కి చెందిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా 20-నవంబర్-2021 తదుపరి మంచి ఫలితాలు ఎదుర్కొందురు. అన్ని
విధములా గురు గ్రహం 20-నవంబర్-2021 నుండి అనుకూల ఫలితాలు ఏర్పరచును.
మిధున రాశి
వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఆరోగ్య సమస్యలు
కొనసాగును. వృద్ధులైన తల్లిదండ్రుల కు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం. వారి
ఆరోగ్య విషయాల పట్ల సదా జాగ్రత్తగా ఉండవలెను. శనైశ్చరునికి ఒక పర్యాయం శాంతి జపం
జరిపించుకోనుట మంచిది. మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ
లేదు.
మిధున రాశి
వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు వలన వ్యాపార సంబంధ, వివాహ సంబంధ న్యాయస్థాన తగాదాలలో విజయం
లభింపచేయును. అయితే సంవత్సరం అంతా తరచుగా వృధా వ్యయం ఎదుర్కొందురు. ఆర్జించిన ధనం
చేతిపై నిలువదు. అనుకున్న విధంగా నిలువ ధనం ఏర్పరచుకోలేరు. స్నేహితుల వలన ఆర్ధిక
సంబంధ ఇబ్బందులు, నమ్మక ద్రోహం
ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో జాగ్రత్తగా
ఉండవలెను.
ఏప్రిల్ 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ
ఫలితాలు ఏర్పడును. సంసార సంబంధంగా చికాకులను చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు.ఆర్ధికంగా
ఇబ్బందులు ఉండవు. ధనాదాయం బాగుండును. రుణ
బాధలు తొలగుతాయి. భూ సంబంధ పెట్టుబడులు నష్ట పరచును. వాహన సంభందిత వ్యయం ఏర్పడును.
ద్వితియ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభం, విజయం. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. శుభ కార్యములు వాయిదా వేస్తారు.
మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ది పొందుతారు. విద్యార్ధులకు మంచి కాలం. ఆశించిన
విద్యా అవకాశములు పొందగలరు. ఈ మాసంలో 2,7,8, 11 తేదీలు అనుకూలమైనవి కావు.
మే 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో
ముఖ్యమైన కార్యములను అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. పిత్రు వర్గం వారి సహకారం
లభించును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు
ప్రయత్నాలు చేయుటకు ఇది అనువైన కాలం. సంతాన ప్రవర్తన కొంత ఆందోళన
కలుగచేయును. విదేశి ప్రాంతం లో స్థిరత్వం
కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. వ్యాపార రంగంలోని వారికి నూతన పెట్టుబడులు లభించును.
వ్యాపార విస్తరణ కు ఇది అనుకూల కాలం. మాసాంతంలో ప్రతిభ కు తగిన ప్రోత్సాహం ఉండును.
ఉదర సంభందమైన సమస్యలు భాదించగలవు.
జూన్ 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో చక్కటి
ధన సంపాదన పొందుదురు.గృహ వాతావరణం లో చికాకులు తొలగును. వివాహ ప్రయత్నాలు
ఫలిస్తాయి. దూరప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం లభిస్తుంది. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు
ఫలించును. ఉద్యోగ జీవనంలో పని భారం తగ్గుతుంది. ప్రమోషన్లకు అవకాశం ఉన్నది.
మాసాంతంలో వృధా వ్యయం ఎదురగు సూచన ఉన్నది. ప్రభుత్వ సంబంధ వ్యవహారములలో విజయం
లభించును. ఈ నెలలో 3, 6, 16, 23 , 25, తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాస ప్రారంభంలో మంచి అనుకూలత, ఆ తదుపరి కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన
ధనప్రాప్తి లభిస్తుంది. ఆశించిన విధంగా వాహన సౌఖ్యం పొందుదురు. కుటుంబ వ్యవహారాలలో
మీకు అనుకూలంగా మార్పులు ఏర్పడతాయి. దూరమైన మిత్రులు తిరిగి దగ్గర అవుతారు. సంతాన
సంబంధ శుభ వార్తలు పొందుతారు. బంధు లేదా స్నేహ వర్గ రాక పోకలు ఆనంద పరచును. విదేశీ
నివాస ప్రయత్నములు చేయువారికి అనుకూల ఫలితాలు. ద్వితీయ వారం చివరి వరకూ పెద్దగా
ఇబ్బందులు ఏర్పడవు. 16 వ తేదీ నుండి
కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు. మాసాంతంలో వృత్తిలో ప్రతికూల
ఫలితాలు. ఈ మాసంలో 19, 20, 21 తేదీలు అనుకూలమైనవి కావు.
ఆగస్టు 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో
ధనసంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. ఉద్యోగ
ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. ధనాదాయం పెరుగును. నూతన కాంట్రాక్టులు
లభిస్తాయి. మాతృ వర్గీయులు వైరాగ్య భావన వలన బాధించబడతారు. ద్వితియ వారంలో సామాన్య
ఫలితాలు లభిస్తాయి. తృతీయ వారంలో మానసిక ఒత్తిడి తగ్గును. సుఖ సంతోషములు
నెలకొనును. సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభములు ఏర్పడును. స్త్రీలకు వారసత్వ సంబంధ
లాభములు లభించును. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ మాసంలో 10వ తేదీ
నుండి 15 వ తేదీ మధ్య
కాలం వివాహ ప్రయత్నములుకు శుభం.
సెప్టెంబర్ 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సోదర
వర్గంతో వివాదముల మూలంగా ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచన కలదు. అనవసర ప్రయాణాలు
చేయుదురు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలుగచేయును. నివసిస్తున్న గృహంలో మార్పులు
చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ప్రతీ వ్యవహారం నిదానంగా పూర్తిఅగును. మీరు మంచి
చెప్పినా ఎదుటి వారు లెక్క చేయని పరిస్తితులు ఎదురగును. చివరి వారంలో వాహన ప్రమాదం
ఎదుర్కోను సూచన లేదా ఆరోగ్య రుగ్మతలు బాధించును. 24వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త
అవసరం. ఈ నెలలో 2, 7, 15, 18, 21, 24 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో
ధనాదాయం సామాన్యం.
అక్టోబర్ 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం
సామాన్యం. గతకాలంలో తెలియక చేసిన తప్పులు అవమాన భారం ఏర్పరచును. మాతృ వర్గం వారికి
అనారోగ్య సూచన. ప్రధమ వారంలో షేర్ల విక్రయాల వలన ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు
సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య
ఫలితాలు ఏర్పరచును. తృతియ వారం విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉండును. పరదేశ విద్య
కోసం చెసే ప్రయత్నాలు లాభించను. బందువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి
జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. రాజకీయ సన్మానం లభించును. నూతన వ్యాపార
ప్రయత్నాలు స్థిరచిత్తంతో ప్రయత్నించవలెను. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా
అధిగమించగలుగుతారు.
నవంబర్ 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గృహంలో
శుభ కార్యక్రమాలు , సంతోష కార్యములు
నిర్వహిస్తారు. చక్కటి మానసిక ప్రశాంతత లభించును. నూతన పరిచయాలు దీర్హకాలిక
బంధాలకు దారితీయును. ధనాదాయం లో పెరుగుదల ఏర్పడును. వివాహాది విషయములకై తీవ్రంగా
చర్చలు జరుపవలసి వచ్చును. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి
చికాకులు ఎదురగును. ఉన్నత అధికారుల వలన ప్రతిభంధాకలు ఏర్పడును.రోజువారీ వ్యయం కూడా
పెరుగును. భూమి లేదా స్థిరాస్తి వ్యవహారములో వివాదములు ఏర్పడు సూచన.
డిసెంబర్ 2021 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సంతాన
సంబంధ లాభములు మరియు జీవన అభివృద్ధి లో లాభములు పొందుతారు.ధనాదాయం పెరుగును. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి లభించు సూచన.
అందరి మన్ననలూ పొందుదురు. నూతన గృహ ప్రయత్నములు ఫలించును. మానసిక ఆలోచనలు
అధికమగును. ప్రేమకలాపముల వలన ఆర్ధిక వ్యయం ఎదుర్కొందురు. ఈ మాసంలో ప్రారంభించు
నూతన వ్యాపారములు విజయవంతం అగును. భాగస్వాములను సమకుర్చుకోగలరు. ప్రాజెక్టులను
సకాలంలో పూర్తి చేయుదురు.కళా రంగంలోని వారికి నూతన అవకాశములు లభించును.
జనవరి 2022 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం లభించును.
నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ఆర్జన చేయుదురు. ఈ మాసంలో ధన సంపాదన పెరుగును.
ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన
ఫలితం వుండదు. పోటీదారుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ప్రధమ, ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు
ఏర్పరచును. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. జీవిత భాగస్వామితో మాట
కలయికలో ఇబ్బందులు ఎదురగును. ఆచారవంతమైన
జీవితానికి ఆలోచనలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం.
ఫిబ్రవరి 2022 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం కోర్టు
వ్యవహరాలకు, అవివాహితుల వివాహ
ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. నూతన వ్యక్తుల
చేరిక వలన కుటుంబ బలం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా
స్థానచలన ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారములు విస్తరించే
అవకాశం లభించును. భాగస్వామ్య వ్యాపార
ప్రయత్నములు లాభించును. ముఖ్యంగా వ్యాపార వర్గం వారికి 25, 26, 27 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.
మార్చి 2022 మిధున
రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం
బాగానే ఉండును. సంఘం లో చక్కటి పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. తోటి ఉగ్యోగుల మధ్య గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు
లభిస్తాయి. శతృ జయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారతారు. అన్ని
విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వినుదురు. మీ అంచనాలు
నిజమగును. ఈ మాసంలో చేయు ప్రయనములందు చిన్నపాటి
ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబంలో ఆర్భాటాలకు పోకుండా ఉండుట మంచిది.
No comments:
Post a Comment