12/16/2011

About 18 holy steps of ayyappa

అయ్యప్ప పడి మెట్లు  : padunetambadi
అయ్యప్ప భక్తులకు పడి మెట్లు చాల పవిత్ర మైనవి . పురాణాల రీత్యా వీటిని పరసు రాముడు నిర్మించను . స్వామి దీక్ష పూనిన భక్తులు ఇడుముడి తలన ధరించి ఈ మెట్లు ఎక్కి స్వామి సన్నిధానానికి చేరుతారు .ఈ 18  మెట్లకు 18  పేర్లు మరియు 18 అధిష్టాన దేవతలు కలరు . వారు ఎవరు వారి పేర్లు తెలుసుకుందాం .
మొదటి సోపానం : అణిమ        { శాంఖరి }  shankari
రెండవ సోపానం : లఘిమ        {కామాక్షి }  kamakshi
మూడోవ సోపానం : మహిమ    {శృంగల}  srungala
నాల్గవ సోపానం : ఈశత్వ     { చాముండేశ్వరి }  chamundeswari
ఐదవ సోపానం : వశత్వ     {జోగులాంబ }  jogulambha
ఆరవ సోపానం : ప్రాకామ్య   {బ్రమరాంభ }    bramarambha
ఏడవ సోపానం : భుద్ధి        {మహా లక్ష్మి}   maha lakshmi
ఎనిమిదొవ సోపానం : ఇచ్ఛ  {ఏక విరిక }      yeka virika
తోమిదవ సోపానం : ప్రాప్తి      {మహా కాళీశ్వారి}  maha kaleshwari
పదోవ  సోపానం : సర్వ కామ {పురు హుతిక}    puru hutika
పదకొండవ  సోపానం : సర్వ సంపత్కర   { గిరిజ }         girija
పనేండవ సోపానం : సర్వ ప్రియంకర       {మణిఖ్య}   manikhya
పదముదోవ  సోపానం : సర్వ మంగళకర {కామరూప}   kamarupa
పద్నాల్గవ సోపానం : సర్వ దుఃఖ విమోచన{మాధవేశ్వరి }  madhaveswari
పదిహేనోవ  సోపానం : సర్వ మృత్యు వసస్యమణ  {వైష్ణవి } vayshnavi
పదహారోవ  సోపానం : సర్వ విఘ్ననివారణ  {గళ్యగౌరిక }  gowlyagowrika
పడి హేదోవ  సోపానం : సర్వాంగ సుందర   {విశాలాక్షి }  visalakshi
పదఎనిమిదో సోపానం : సర్వ సౌభాగ్య దాయక {సరస్వతి }saraswathi అనునవి   .
అంతే కాక పదునెనిమిది సంఖ్యకు పౌరానికంగా చారిత్రికంగా ఎంతో గొప్ప స్తానం ఉన్నది .
పురాణాలూ పదునెనిమిది {astadasa puranalu } , భగవద్గీత లోని అద్యాయాలు పదునెనిమిది .{bhagavadgeeta chapters 18 } , పంచమ వేదం గా భావించే మహా భారతం లోని పర్వాలు పదునెనిమిది { maha Bharatham chapters 18 } , ఆ యుధం లో పాల్గొన్న అక్షోహని సైన్యం పదునెనిమిది , యుధం జరిగిన రోజులు పదునెనిమిది ,రామ రావణ యుధం కూడా పదునెనిమిది రోజులే జరిగింది అని మనకు పురాణాలూ చెబుతున్నాయ్ . అయ్యప్ప దీక్ష వేసుకొని ఇడుముడి తలన ధరించి ఈ మెట్లు ఎక్కవలెను . వెడల్పు తక్కువ ఎత్తు ఎక్కువ ఉండే ఈ మెట్లు ఎక్కే సమయాన అష్టాదశశక్తులు వారిని కాపాడును .

      







11/09/2011

elinati sani effect and remedies are sade sati [Saturn effect] Saturn moves into Libra effect]

                                                          ఓం నమో శనీస్వరాయ నమః 

శ్లోకము :నీలాంజన సమాభాసం ! రవి పుత్రం యమాగ్రజం !!
            ఛాయ మార్తాండ సంభూతం ! తం నమామి శనేశ్వరం !!
                                                                                                                                                                                                జన్మరశికి 12 , 1 , 2 ,రాశులలో గోచారరీత్యా  శని సంచరించుటనే ఏలినాటి శని అని అందురు .
ఒక్కక రాశి లో 2  1/2  సం# రములు చొప్పున మొత్తం 7 1/2 సం# రములు దోషమగును .
12  వ రాశి లోనికి రాగానే ధన వ్యయము ఫై దెబ్బ తీయును . దరిద్రము, ఇంటి పోరు ,కష్టములు ,మానహాని ,వ్యవహార చిక్కులు  కలుగును . జన్మ రాశి లోనికి రాగానే గతం లో మిగిలినది ఏమైన వుంటే అదికూడా ఖర్చు చేయించి శరీరమును భాదించును .బందు  అరిష్టము , కళత్ర  పీడా ,గుర్తించలేని వ్యాధులు ,మతి భ్రమణం ,కళా కాంతులు లేకపోవటం , కలిగించును . 2 వ రాశి కి రాగానే - ఎనలేని ఆశలు కలిగించును .కానీ నిందలు పడుట , నిత్య దుఖము కలుగును . మానసికముగా కుంగదీయును . 3  వ రాశి లోనోకి  ప్రవేశించ గానే సర్వ శుభములు కలిగించును .జనన కలం లో శని స్వస్థాన , ఉచ్చ లగ్నము లందు శని ఆధిపత్య నక్షత్రము లందు జన్మించిన వారికి ఈ శని రాశుల సమీప సంచారము నందు ఉన్నతిని కలిగించును అని భావించ వచ్చు .ఏది ఏమైన  జన్మరశికి 12 , 1 , 2 ,రాశులలో  శని సంచారము ఇట్లు ఉండును .
  1. ౦ సం# 3  నెలల 10  రోజులు ముఖము నందు -హాని ,పీడా ,వ్యయ ప్రయాణాలు .
  2. 1 సం # 1 నెలల ౦౦ రోజులు దక్షిణ భుజము -జయం ,లాభం ,కొంత వరకు శాంతి .
  3. 1 సం # 8  నెలల 10 రోజులు పదములు -త్రిప్పుట , బెంగ , అశాంతి .
  4. 1 సం # 4  నెలల 20  రోజులు హృదయ స్థానం-ధన ప్రాప్తి ,గౌరవం ,ఉన్నతి ,స్టిరం.
  5. 1 సం#  1 నెలల 10  రోజులు వామ భుజం-రోగము ,దుఖము,అస్థిమితం.
  6. ౦ సం# 10 నెలల 00 రోజులు శిరోభాగం-సంతోషం , లాభం,లాటరి చాన్స్ .
  7. 0 సం # 6  నెలల 20  రోజులు కన్నులు -మర్యాద ,మన్నన, సంతోషం.
  8. 0 సం # 6  నెలల 20  రోజులు గుదము-గొప్ప దుఖము ,మన హాని .

మొతంమీద శని సంచార వేళ -గురు బలం కొంత ఉపయుక్తం అవుతుంది.ఏది ఏమైన ఈ 7 1/2 సం# రములు శని స్తోత్రం , జపము , దానం , ధ్యాన శాంతి మొదలైనవి ,మృత్యుంజయ మంత్ర పటనం వంటివి చేయ వలెను .
మరీ చిక్కులు పడేవారు తంత్ర శాస్త్రం ప్రకారం ,కలి మట్టి పాత మేకు గ్రహించి నల్ల గుడ్డలో శనీశ్వర మంత్రం లికించి అచ్చట కాలువలో వర్జించ వలెను . నలుపు వస్త్రము , నువ్వులు ,నునే ,బెల్లం ,నవధాన్యాలు ,మున్నగు పదార్ధాలు ,అభిషేకమునకు ,వినియోగించ దగును .

గమనిక :On November 15th ITS, Saturn moves into Libra where he becomes exalted, meaning the ability to deliver his highest and most beneficial qualities without encumbrances. Saturn will be in Libra for 3 years until November 2  ND, 2014. This is a remarkable 6 months longer than a normal Saturn transit which is usually 2.5 years.
Note: November 15th, 2011 ITS transit date is according to the Thirukanitham(Drik) Almanac which is used by Astroved and most astrologers/astronomers. December 21st, 2011 ITS is the transit date according to the Vakkyam Almanac used in Southern India. It is respected and used in temples. We celebrate both .

10/21/2011

Sahasra Lingarchana Vidhanam Ekadasha Rudrabhisheka vidhi

 Sahasra Lingarchana vidhanam Ekadasha-Rudrabhisheka:- 

సహస్రలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము :-
కలియుగమున ప్రతి ఒక్కరు ప్రతి దినము పరమేశ్వరుని ఆరాధన మరియు అభిషేకం చేయుట నిత్య కర్మలలో భాగము.కానీ కలిప్రభావము వలన ఐహిక విషయాలలో మునిగి ఈశ్వర  ఆరాధన మరుస్తున్న రోజులివి . ఇలాంటి కాలములో ఈశ్వర కృపచే ధర్మార్ధ ,కామ్య,మోక్షములు పొందవలెను అనిన, యావత్ సంవత్సరము ఈశ్వర ఆరాధన చేసిన ఫలమును ఇచ్చు మాసము కార్తీకము.అట్టి ఈ కార్తీకమాసమున ఏకాదశ రుద్రాభిషేకము లేక పుట్ట మన్నుతో మహాలింగార్చన{mahalingarchana 365లింగములు} లేక సహస్రలింగార్చన {sahasralingarchana 1116లింగములు} చేయుట ఎంతో విశేషము. ఇందు  సహస్రలింగార్చన షోడస ఆవరణములతో అనగా 16 ఆవరణములతో కూడినదై, కైలాస మహా యంత్ర ప్రస్థాన స్థిత ఉమా మహేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైనది.ఈ సహస్రలింగార్చన క్రతువులో ముందుగ "ఆది పూజ్యో వినాయకః " అన్నట్లుగా గణపతి పూజ చేయ వలను .తదుపరి పుణ్యాః వాచనం జరిపి అట్టి ఉదాకముతో పుట్ట మన్ను ఉన్న స్థలమును ప్రోక్షణ చేసి భూమిని ప్రార్ధించి,పూజించి,పుట్టమన్ను గ్రహించవలెను.శుభ్ర పరిచిన పుట్ట మన్నును విభూతి,పసుపు,కుంకుమ,సుగంధ ద్రవ్యములు,పంచామృతం,పాదరసములతో ,కొద్దిగా కలిపి, రొట్టె పిండి వలె తడప వలెను.తదుపరి వేళ్ళకు నెయ్యి రాచుకొని కొద్ది కొద్దిగా మన్ను తీసుకోని 1116లింగములు పంచాక్షరి మంత్రము స్మరిస్తూ చేయవలెను.అలా చేసిన లింగములను పై చిత్రపటము సహాయముతో వరుసగా వంకర లేకుండా తడిపి పిండిన తెల్లని వస్త్రము పై పేర్చవలెను.తదుపరి కాచి చల్లార్చిన ఆవు నేతిని పేర్చిన లింగములపై చల్ల వలెను.
 1116లింగముల విశ్లేషణ ఆవరణ విధానముగా :-
 details of sahasralingarchana :-
  1. అష్టదిక్పాలకులు : 8 x 1 = 8 
  2. ద్వాదశాదిత్యులు :4  x 2 = + 4 = 12 
  3. త్రిశులేశ్వారులు : 8  x  3  = 24 
  4. తాన్డవేశ్వరులు :  50 x 8  = 400 
  5. అస్తభేతాలేశ్వరులు:4 x 2 = 8 
  6. చతుర్వేదములు :4  x  1  = 4  
  7. షోడద్వారపాలకులు: 8 x 2 = 16 
  8. పత్నీ సమేత అష్టమూర్తులు :8 x 2 = 16  
  9. పంచ బ్రహ్మలు : 5  x  5  = 25 
  10.  సప్తక్షు అష్ట అష్ట వసువులు: 7  x  8  =56 
  11.  నవగ్రహములు = 9 
  12.  పర్వత,నది,ఋషి,సాగరాలు = 4  x 7  = 28 
  13.  షట్ తారకలు : 6 
  14. గంగా,పార్వతీ:1 +1 =2
  15. ఏకాదశ రుద్రులు = 11
  16. మహాలింగము = 484 .
దక్షిణామూర్తి ,చండీశ్వరుడు,చంద్రకళ,చిత్రుడు,చిత్రగుప్తుడు,యముడు,గణపతి, = 7
ఈ విధముగా సమకూర్చుకొని పాంచభౌతిక శరీర శుద్ధి అర్ధం మహన్యాస పారాయణం గావించి ఏకాదశ రుద్రాభిషేకము చేయ వలెను .సర్వేజన సుకినోభవంతు.

 

9/13/2011

Mahalaya Paksham or Pitru Paksham story

మహాలయపక్షము లేదా పితృపక్షము ప్రచారమున శ్రార్ధపక్షము అని కూడా పిలుస్తుంటారు .పక్షము అనగా 15 రోజులు .ఈ పక్షము ను  పితృ దేవతా ఆరధన చేయవలెనని వేదములు చెప్పు చున్నవి .ఈ పక్షము భద్రపద బహుళ పాడ్యమి నుండి మొదలుకొని అమావాస్య వరుకు  జరుగును.ఈ మహాలయ పక్షం గురించి మహాభారతం నందు ఒక పురాతన కధనం ఉన్నది .
మహాభారతము నందు కర్ణుడు మహా దాన ధర్మములు చేసిన వీరుడు . తన జీవిత కాలమున కర్ణుడు,ధనము,సువర్ణము ,వజ్రములు ,రాజ్యములు ,కవచ కుండలాలు సైతం దానం చేసి దాన కర్ణుడిగా పేరు పొందాడు .కాని మహా భారతము లో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం లో కర్ణుడు మరణించి నరకమునకు చెరను.అంత నరకమున యమకింకరులు భోజనము గా స్వర్ణము ,ధనము ,వజ్రములు ఉంచిరి .అవి చూచి ఆహారమునకు బదులుగా స్వర్ణము ,ధనము ,వజ్రములు ఎందుకు ఉంచిరి అని అడిగెను .అంత యముడు ఇలా  పలికెను " ఎవరు భూలోకమున అన్నదానము చేయరో ,మరియు ఆకలితో ఉన్నవారిని ఆదుకోనరో,పితృ కర్మలు ఆచరించరో,వారికి నరకమున అన్నపానియములు ముట్టవు " మరియు నీ కుమారుడు కూడా అదే సంగ్రామము లో వీర మరణము పొందిన కారణమున భూలోకమున నీకు ఉత్తమ గతులు కలిగే విదముగా ఉత్తర కర్మ ఆచరించు వారు కూడా లేరు.
అంతట కర్ణుడు యముని ప్రార్దించి తనను భూలోకమునకు పంపిన తన పితృ దేవతలకు శ్రార్ధ కర్మ చేసి వచ్చదను అని పలికెను .యముడు సంతోషించి పంపగా 14 దినములు భూలోకమున పేదలకు ,అన్నదానములు మరియు పండితుల చేత తన పూర్వీకులకు పిండ ప్రదానములు,తర్పణములు జరిపించి మరల నరకమునకు చెరను.
ఆనాటినుండి ఈ పక్షమును పితృ పక్షము లేక మహాలయపక్షము అని అందురు .
కావున ఈ పక్షమున పూర్వీకులకు పిండప్రధాన,అగ్నౌకరణ,భ్రామ్మ్హన భోజన ,కర్మత్రయ  విదానము గా పితృ కర్మ ఆచరించిన ,పూర్వీకులు తప్పక స్వర్గాది ఉత్తమ గతులు పొందురని వేదములు పలుకుచున్నవి .వైశ్య ,క్షేత్రియ,శూద్రాదులు ,తమ తమ కల్పోక్త ప్రకారముగా ఈ కర్మను ఆచరించ గలరు .

9/08/2011

kuja dosham and remedies

                   కుజ దోషము -ఇతర విషయములు
1 .జాతక పారిజాతం లో 2,4,7,8 స్థానములలో కుజుడు ఉన్నచో పురుషునికి భార్య వియోగము స్త్రే కి భర్త వియోగం ఉన్నది.
2 .బృహత్ హోరా శాస్త్రం లో కుజ దోషాన్ని లగ్నం నుండి కాకుండా శుక్ర ,చంద్ర  లగ్నాల నుండి కూడా పరిశీలించాలి.
3 .స్త్రీ జాతకం లో గురు బలం వల్ల పురుష జాతకం లో శుక్ర బలం వల్ల కుజదోషం పూర్తిగా ఉండదు .
4. జమిత్రీచ యధా సౌరి లగ్నేవా హీబుకీధవ |
   నవమే ద్వాదశీ చైవ కుజదోషం న విద్యావే ||
   శని జన్మ లగ్నం లో గని 7,4,9,12 స్థానాలలో గాని ఉంటె కుజదోషం ఎక్కువగా ఉండదు.
5 .మేష,కర్కాటక, సింహ ,వృశ్చిక ,ధనుర్ ,మకర ,మీన లగ్నాలలో జన్మించిన వారికీ ఏ స్థానములో ఉన్న కుజదోషం ఉండదని కొందరు పెద్దలు కొన్ని గ్రంధాలలో పెర్కున్నారు .కానీ ఈ అభిప్రాయం తప్పు 12 లగ్నలలో 7 లగ్నాలు  వారి  కుజదోషం ఉండదు.
6.కుజదోషము నిర్ణయించునపుడు భావ చక్రము తప్పక పరిశీలించు కో  గలరు .
7 .కుజదోషము నకు శని,రవి,రాహు,కేతు,గ్రహ దృష్టి ,కలయిక,మంచివి కావు .ఇంకా దోష ప్రధమగును.
8.ముఖ్యముగా భుధుని  తో కలయిక మంచిది కాదు.
 9.ప్రవాళ గొధూమ మశూరికాశ్చ వృషారుణశ్చాపి గుడో సువర్ణం|
  అ రక్త వస్త్రం శరవీర పుష్పం తామ్రంహి భౌమాయ పదన్నిదానం||
   పగడము,గోధుమలు,చిరుశెనగలు,యెర్రనిఎద్దు,బెల్లం,బంగారము,యెర్రనివస్త్రం,యెర్రగన్నేరు,రాగిని కుజదోషము పరిహారము మంగళవారము దానము ఇవ్వవలేను .
 10 . కుదోశము నివారణకు వేదోక్తముగా కుజ వేద మంత్రమును 7.000 సార్లు జపము , 700 తర్పణము , 70 సంఖ్య హోమము ,కందులు దానము చేయవలెను .