మహాలయపక్షము లేదా పితృపక్షము ప్రచారమున శ్రార్ధపక్షము అని కూడా పిలుస్తుంటారు .పక్షము అనగా 15 రోజులు .ఈ పక్షము ను పితృ దేవతా ఆరధన చేయవలెనని వేదములు చెప్పు చున్నవి .ఈ పక్షము భద్రపద బహుళ పాడ్యమి నుండి మొదలుకొని అమావాస్య వరుకు జరుగును.ఈ మహాలయ పక్షం గురించి మహాభారతం నందు ఒక పురాతన కధనం ఉన్నది .
మహాభారతము నందు కర్ణుడు మహా దాన ధర్మములు చేసిన వీరుడు . తన జీవిత కాలమున కర్ణుడు,ధనము,సువర్ణము ,వజ్రములు ,రాజ్యములు ,కవచ కుండలాలు సైతం దానం చేసి దాన కర్ణుడిగా పేరు పొందాడు .కాని మహా భారతము లో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం లో కర్ణుడు మరణించి నరకమునకు చెరను.అంత నరకమున యమకింకరులు భోజనము గా స్వర్ణము ,ధనము ,వజ్రములు ఉంచిరి .అవి చూచి ఆహారమునకు బదులుగా స్వర్ణము ,ధనము ,వజ్రములు ఎందుకు ఉంచిరి అని అడిగెను .అంత యముడు ఇలా పలికెను " ఎవరు భూలోకమున అన్నదానము చేయరో ,మరియు ఆకలితో ఉన్నవారిని ఆదుకోనరో,పితృ కర్మలు ఆచరించరో,వారికి నరకమున అన్నపానియములు ముట్టవు " మరియు నీ కుమారుడు కూడా అదే సంగ్రామము లో వీర మరణము పొందిన కారణమున భూలోకమున నీకు ఉత్తమ గతులు కలిగే విదముగా ఉత్తర కర్మ ఆచరించు వారు కూడా లేరు.
అంతట కర్ణుడు యముని ప్రార్దించి తనను భూలోకమునకు పంపిన తన పితృ దేవతలకు శ్రార్ధ కర్మ చేసి వచ్చదను అని పలికెను .యముడు సంతోషించి పంపగా 14 దినములు భూలోకమున పేదలకు ,అన్నదానములు మరియు పండితుల చేత తన పూర్వీకులకు పిండ ప్రదానములు,తర్పణములు జరిపించి మరల నరకమునకు చెరను.
ఆనాటినుండి ఈ పక్షమును పితృ పక్షము లేక మహాలయపక్షము అని అందురు .
కావున ఈ పక్షమున పూర్వీకులకు పిండప్రధాన,అగ్నౌకరణ,భ్రామ్మ్హన భోజన ,కర్మత్రయ విదానము గా పితృ కర్మ ఆచరించిన ,పూర్వీకులు తప్పక స్వర్గాది ఉత్తమ గతులు పొందురని వేదములు పలుకుచున్నవి .వైశ్య ,క్షేత్రియ,శూద్రాదులు ,తమ తమ కల్పోక్త ప్రకారముగా ఈ కర్మను ఆచరించ గలరు .
No comments:
Post a Comment