11/02/2021

1st year Samvatsareeka Srardham Puja items list in Telugu

సంవత్చరీక పితృ కార్యమునకు సామగ్రి మరియు వివరాలు.

పసుపు 50గ్రా, కుంకుమ 50గ్రా, 
తమలపాకులు 10, వక్కలు 4,
అగరవత్తులు 1 ప్యా, 
కర్పూరం 100గ్రా, అరటిపండ్లు 12, 
కొబ్బరికాయలు 1,
దీపారాధన కుందులు, వత్తులు, నూనె, 
చిల్లర పైసలు 25 సెంట్స్  40.
డిస్పోసల్ గ్లాస్ లు 6, బౌల్స్ 6,
 పూలు కొన్ని, గంధం చిన్న డబ్బా, 
నల్ల నువ్వులు 50గ్రా,
అల్యూమినియం ట్రేలు 2,
మామిడి ఆకులు, 
అరటి ఆకులు,
బియ్యం పిండి , పాలు ( పిండప్రదానం కోసం ). 


బ్రాహ్మణ స్వయంపాకం దానం సామగ్రి: 
బియ్యం, కందిపప్పు, ఇంగువ, వంట నూనె, వేరుశనగ గుండ్లు, తెల్ల  మినప గుండ్లు, ఎండు కారం , గోధుమ రవ్వ,
కూరగాయలు : బెండకాయలు , దొండకాయలు, దోసకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిరపకాయ. అల్లం, పాలు 1

సంవత్సారీకమునందు దశ దానాలు ఉంటాయి కనుక అందులో ప్రతీ దానానికి $11 చొప్పున తాంబూలంలో ఏర్పాటు చేసుకోవలెను. ఈ దానములకు దక్షిణకు సంబంధం లేదు.
దశ దానాలు వివరాలు: 1. వస్త్ర దానం, 2. పుస్తకదానం, 3. సువర్ణదానం(బంగారం), 4. దీపదానం, 5. భూదానం, 6. గోదానం, 7. ధాన్యాదానం, 8. ఆద్యదానం (నెయ్యి), 9. గుడా దానం(బెల్లం), 10. ఛత్ర(గొడుగు), చమర(విసనకర్ర), పాదుకలు(చెప్పులు), సాలగ్రామం(శివలింగం), యజ్ఞోపవీతం. ఇవి దశ దానాలు.
గమనిక: 1. కర్త విధిగా మడి కట్టుకొని (పంచ, కండువా ధరించి) కార్యక్రమం నిర్వహించాలి.

No comments:

Post a Comment