1/10/2012

what is Makara Sankranti in telugu


సంక్రాంతి పురుషుడురాక్షస నామధేయుడు               మహిషి[దున్నపోతు]వాహనము.
శ్రీ ఖర నామ సంవత్సరము  పుష్య  బహుళ  షష్టి  శని వారము  హస్త నక్షత్ర  యుక్త,  అతిగండ యోగ , వణిజ కరణ , ధనుర్లగ్న శుభ సమయాన థి :-14-01-2012 తేది శని వారము రాత్రి తెల్ల వారుజామున గం : 05.46.ని " లకు [తెల్ల వరితె ఆదివారం అనగా ] సూర్యుడు మకర రాశిలోకి ప్రవేసిన్చును .కనుక .15-01-2012   తేది ఆదివారం సంక్రాంతి పండుగ .
మకర సంక్రాంతి పుణ్య కాలం ఉదయం 06.38. ని::ల నుండి సా :: 05.41 ని :: వరకు ఉందును .
ఈ సంక్రాంతి పురుషుడు  రాక్షస నామధేయుడు   కావున చండాలురకు అరిష్టం , మహిషి వాహనం చే క్షుద్ భాధ , నిర్మలోడక స్నానమ చే సువృష్టి , కంబళి వస్త్ర ధారణ వలన స్వామిజి లకు అరిష్టం , ముద్గాక్షతలు వలన ధాన్య నాశనము , పగడం ధరించుట చే దుష్టనాసనము , వస గంధ లేపనము చే విష నాశనము , నల్ల కలువ ధరించుటచే ఫల నాశనము , తగరపు పాత్ర వలన రోగములు , తోమరం ఆయుధం వలన యుద్ధ భయం , మయూర ఛత్రం వలన మృత్యు నాశనం , లోల ముఖము చే వర్షము తక్కువ , తాటి పండు భుజించుట చే బెల్లం ధర పెరుగుట , పెరుగు త్రాగుటచే తేజో నాశనము , కూర్చొని ఉండుటచే మధ్యర్గ్యము , వాయువ్య గమనము చే వాయువ్య రాష్ట్రములకు మరియు వాయవ్య దేశములకు అరిష్టము , కృష్ణ పక్షము వలన దేశము సుభిక్షము , క్షేమ ఆరోగ్యములు కలిగి జంతువులకు మాత్రం రోగములు కలుగును , షష్టి తిది వలన భయము , శని వారము  వలన యుద్ధ భయము , తెల్ల వారు జమున కనుక గో వులకు గోపాలకులకు అరిష్టము , హస్త నక్షత్రము వలన దుర్భిక్షము , అతి గండ యోగం వలన సువృష్టి , ధనుర్లగ్నం వలన మంచి వర్షము , 30 ముహూర్తము వలన ప్రకృతీ  విపరీతము  కలుగును , 
 మకర సంక్రాంతి పుణ్య కాలం చాల మంచిది , ఈ పర్వ దిన మందు శక్తీ కొలది ఎవరికి వారు  బంగారము, వెండి , భూమి , గోవులు , ధాన్యము , వస్త్రము , పండ్లు , కూరగాయలు , బూడిద గుమ్మడికాయ , దానము చేసిన గ్రహ భాదలు తొలగి పోయి , ఆయురారోగ్యములు ,  మనః శాంతి తప్పక కలుగును ,  ఈ మకర సంక్రాంతి పుణ్య సమయము నందు పితృ దేవతల తృప్తికి స్నాన , దాన , తర్పణ , శ్రార్ధములు , ఆచరించ వచ్చును.

No comments:

Post a Comment